-అత్యంత పారదర్శకంగా ఈ వి ఎమ్ ల ర్యాండమైజేషన్ ప్రక్రియ
-అభ్యర్దులు విజ్ఞప్తి మేరకు రెండూ రౌండ్లలో ర్యాండమైజేషన్
-ఆర్ ఓ – ఎమ్. మాధురి
అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అనపర్తి అసెంబ్లీ సిగ్మెంట్ కు సంబంధించిన రెండోవ తుది విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ అభ్యర్ధుల సమక్షంలో చేయడం జరిగిందని అనపర్తి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. మాధురి తెలియ చేశారు. బుధవారం అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) బ్యాలెట్ , కంట్రోల్ యూనిట్స్, వివి పాట్స్ ఓటర్ రెండో , తుది విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ నియోజక వర్గాల వారిగా పరిశీలకులు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఎం మాధురి మాట్లాడుతూ, అనపర్తి అసెంబ్లీ సెగ్మెంటుకు సంబంధించి 228 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈ వి ఎమ్ లు 20 శాతం అదనంగా కలిపి 273 బ్యాలెట్ యూనిట్లు, 273 కంట్రోల్ యూనిట్లు, 30 శాతం అదనంగా కలిపి 296 వివిప్యాట్ లు కేటాయించిన్నట్లు చెప్పారు. .
ఈ కార్యక్రమంలో పోటీలో నిలిచిన అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.