-రూరల్ పరిధిలో రెండోవ రౌండ్ తుది విడత ఈ వి ఎం ర్యాండమైజేషన్ పూర్తి
-అభ్యర్దులు విజ్ఞప్తి మేరకు మూడు రౌండ్లలో ర్యాండమైజేషన్
-ఆర్ ఓ/ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సిగ్మెంట్ కు సంబంధించిన రెండోవ తుది విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ అభ్యర్ధుల సమక్షంలో చేయడం జరిగిందని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తెలియ చేశారు.
బుధవారం కలెక్టరేట్ లో రాజమండ్రి రూరల్ అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) బ్యాలెట్ , కంట్రోల్ యూనిట్స్, వివి పాట్స్ ఓటర్ రెండో , తుది విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ నియోజక వర్గాల వారిగా కలెక్టర్ మాధవీలత, ఎన్నికల సాధారణ పరిశీలకులు కే. బాల సుబ్రహ్మణ్యం, కమల్ కాంత్ సరోఛ్, రాజమండ్రి రూరల్ అసెంబ్లి నియోజక వర్గ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, రాజమండ్రి అసెంబ్లీ సెగ్మెంటుకు సంబంధించి 237 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈ వి ఎమ్ లు 20 శాతం అదనంగా కలిపి 285. బ్యాలెట్ యూనిట్లు, 285 కంట్రోల్ యూనిట్లు, 30 శాతం అదనంగా కలిపి 348 వివిప్యాట్ లు కేటాయించిన్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో పోటీలో నిలిచిన అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.