-అభ్యర్ధుల సమక్షంలో ఈ వీ ఎమ్ ర్యాండమైజేషన్ పూర్తి
-ఆర్ ఓ/ మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజమండ్రి సీటీ అసెంబ్లీ సిగ్మెంట్ కు సంబంధించిన రెండోవ తుది విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ అభ్యర్ధుల సమక్షంలో చేయడం జరిగిందని రాజమండ్రి సిటీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, మునిసిపల్ కమిషనర్ కే. దినేశ్ కుమార్ తెలియ చేశారు.
బుధవారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో రాజమండ్రీ సీటీ అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) బ్యాలెట్ , కంట్రోల్ యూనిట్స్, వివి పాట్స్ ఓటర్ రెండో , తుది విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించగా, ఆన్లైన్ ద్వారా కలెక్టర్ మాధవీలత, ఎన్నికల సాధారణ పరిశీలకులు కే. బాల సుబ్రహ్మణ్యం, కమల్ కాంత్ సరోఛ్ పర్యవేక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, రాజమండ్రి సీటీ అసెంబ్లి సెగ్మెంటుకు సంబంధించి 237 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈ వి ఎమ్ లు 20 శాతం అదనంగా కలిపి 285. బ్యాలెట్ యూనిట్లు, 285 కంట్రోల్ యూనిట్లు, 30 శాతం అదనంగా కలిపి 348 వివిప్యాట్ లు కేటాయించిన్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో పోటీలో నిలిచిన అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.