Breaking News

హోం ఓటింగు కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం

-మే 2 వ తేదీ, మే 8 వ తేదీ హోం ఓటింగు కోసం క్షేత్ర స్థాయిలో బృందాల పర్యటన
-జిల్లాలో 7 నియోజక వర్గాలలో హోం ఓటింగు కోసం 69 బృందాలు, 400 మంది సిబ్బంది నియామకం
-జిల్లాలో అంగీకారం తెలియ చేసిన 1306 మంది ఓటర్లు
-అంగీకారం తెలిపిన 85 ప్లస్ ఓటర్లు 648 , పి డబ్ల్యూ డి ఓటర్లు 658 మంది
-హోం ఓటింగు ప్రక్రియ ను వీడియో రికార్డింగ్ చెయ్యడం జరుగుతుంది
-కలెక్టర్/డి ఈ వో మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రక్రియ లో కీలకమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా 1306 మంది ఓటర్లకు హొమ్ ఓటింగు ప్రక్రియ కు క్షేత్ర స్థాయిలో మే 2 వ తేదీన ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునేలా కార్యచరణ సిద్దం చెయ్యడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె..మాధవీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు సంబంధించి క్రమంలో హొమ్ ఓటింగు కోసం తూర్పు గోదావరి జిల్లాలో మే 2 వ తేదీ, మే 8 వ తేదీ లలో హోం ఓటింగు కోసం రిటర్నింగ్ అధికారు లకు దిశా నిర్దేశనం చేశామన్నారు.

అందులో భాగంగా 85 ప్లస్ కేటగిరిలో 648 , పి డబ్ల్యూ డి కేటగిరిలో 658 మంది  ” ఫారం 12 డి”  అందజేసినట్లు తెలిపారు.  హోం ఓటింగు ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఏడు అసెంబ్లి నియోజక వర్గాల పరిధిలో 69 రూట్స్ ద్వారా ఆయా ఎన్నికల సిబ్బంది తొలి విడతగా మే 2 వ తేదీన, మిగిలిన వారికి రెండో విడత గా మే 8 వ తేదీన ఓటు వేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఒక వేళ రెండు సందర్భాలలో ఓటు హక్కును వినియోగించుకోని ఎడల మే 13 వ తేదీన ఓటు వేసే అవకాశం ఉండదని తెలియ చేశారు. కావున హోమ్ ఓటింగు కోసం అంగీకారం తెలియ చేసిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు.

నియోజక వర్గాల వారీగా కేటగిరీ వారీగా ఓటర్లు, బృందాలు వివరాలు

** అనపర్తి 85 ప్లస్ 186 , దివ్యాంగులు 222 హొమ్ ఓటింగు బృందాలు 21 సిబ్బంది 147 మంది

** రాజానగరం  85  ప్లస్ ఓటర్లు 33 మంది  ,  దివ్యాంగులు ఓటర్లు 67 మంది   కోసం  హొమ్ ఓటింగు 7 బృందాలు , సిబ్బంది 35 మంది

** రాజమండ్రీ సీటి లో 85  ప్లస్ ఓటర్లు 142 మంది  ,  దివ్యాంగులు ఓటర్లు  65 మంది   కోసం 10 హొమ్ ఓటింగు  బృందాలు , సిబ్బంది 40 మంది

** రాజమండ్రి రూరల్ 85  ప్లస్ ఓటర్లు 51 మంది  ,  దివ్యాంగులు ఓటర్లు  56 మంది   కోసం  హొమ్ ఓటింగు  5 బృందాలు , సిబ్బంది 30 మంది

** కొవ్వూరు 85  ప్లస్ ఓటర్లు 66 మంది  ,  దివ్యాంగులు ఓటర్లు 66  మంది   కోసం  హొమ్ ఓటింగు 8 బృందాలు , సిబ్బంది, 40 మంది

** నిడదవోలు 85  ప్లస్ ఓటర్లు 130 మంది  ,  దివ్యాంగులు ఓటర్లు 145 మంది   కోసం  హొమ్ ఓటింగు  12 బృందాలు , సిబ్బంది 72 మంది

** గోపాలపురం 85  ప్లస్ ఓటర్లు 40 మంది  ,  దివ్యాంగులు ఓటర్లు 37 మంది   కోసం  హొమ్ ఓటింగు  6 బృందాలు , సిబ్బంది 36 మంది

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *