గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం గుడివాడ నియోజకవర్గంలో హోం ఓటింగ్ నిర్వహణ తీరు పరిశీలించారు. తొలుత కలెక్టర్ గుడ్లవల్లేరులో 85 ప్లస్ ఓటర్ పొట్లూరి స్వరాజ్యలక్ష్మి బాయ్ ఇంటి వద్ద హోమ్ ఓటింగ్ బృందం నిర్వహిస్తున్న హోం ఓటింగ్ పరిశీలించారు. ఎన్నికల నిబంధనల మేరకు ఓటరు డిక్లరేషన్ తీసుకోవాలని, సీక్రసీ ఆఫ్ ఓటింగ్ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం 85 ప్లస్ వయస్సు గలవారు దివ్యాంగులు, పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయలేని స్థితిలో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందని, ఈ సౌకర్యాన్ని వారు సక్రమంగా వినియోగించుకునేలా హోం ఓటింగ్ బృందాలు కృషి చేయాలన్నారు.
అనంతరం గుడివాడ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ కలెక్టర్ పరిశీలించి ఈవీఎం కమిషనింగ్ అంటే బ్యాలెట్ యూనిట్ లో బ్యాలెట్ పేపర్ సెట్ చేయడం, కంట్రోల్ యూనిట్ లో అభ్యర్థులు వారి గుర్తులు లోడ్ చేయడం వాటికి సీల్ వేయడం కార్యక్రమాన్ని పరిశీలించారు. రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ పి. పద్మావతి గుడివాడ నియోజకవర్గంలో ఈవీఎం కమిషనింగ్ వివరాలు కలెక్టర్కు నివేదించారు.
హోమ్ ఓటింగ్ బృందంలో పివో పి డేవిడ్ రత్నరాజు, మైక్రో అబ్జర్వర్ ఎస్ రామారావు, తదితరులు పాల్గొన్నారు.