విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అయ్యప్ప నగర్ 12వ డివిజన్లలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్, వైసిపి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ 12వ డివిజన్ ను 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసామన్నారు. స్థానిక టిడిపి ఎమ్మెల్యే ఇంటి ముందు రోడ్ కూడా జగన్ ప్రభుత్వమే వేసిందన్నారు. డివిజన్ లో 20 కోట్లతో సంక్షేమం చేసామన్నారు. ప్రతీ గడప లో జగన్ కే మా ఓటు అని చెబుతున్నారన్నారు. జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవటానికి సిగ్గులేదా అని అన్నారు. స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు గద్దె కి పట్టవు అని అన్నారు. తూర్పు నియోజకవర్గం ఏమైనా మీ జాగీరా అని ప్రశ్నించారు. ఓటమి భయం తోనే దిగజారుడు రాజకీయాల చేయడం టిడిపి నేతలకే దక్కిందన్నారు. 2 సార్లు ఎమ్మెల్యే 1 సారి ఎంపీ అనుభవం అంటే ఇదేనా అని అన్నారు. కాలనీ ల అభివృద్ధి కు స్థానిక ప్రజల కాంట్రిబ్యూషన్ అడిగింది వాస్తవం కాదా అని అన్నారు. ప్రజానీకానికి మంచి చేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గం. ప్రజలు మీ చిల్లర చేష్టలు గమనిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికలె గద్దెకు ఆఖరి ఎన్నికలు. ఇంకా పూర్తి స్థాయిలో వృద్దులకు, వితంతువులకు పెన్షన్ అందలేదన్నారు. పెన్షన్ అందక ఈ నెల 10మంది చనిపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …