గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలు సందర్భంగా ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉద్యోగులకు సూచించారు. 72-గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గుడివాడలో వి కె వి ఎన్ బి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను శనివారం కలెక్టర్ సందర్శించారు. పోస్టల్ ఓటింగ్ కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు పరిశీలించారు. పార్లమెంటు, అసెంబ్లీలకు వేరువేరుగా ఓటింగ్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయాలని, సంబంధిత ఫారాలు, బ్యాలెట్లు ఉంచే కవర్లపై బ్యాలెట్ నెంబర్లు కరెక్ట్ గా వేయాలని, పోలైన ఓట్లు ఇన్ వ్యాలీడ్ కాకుండా ఉద్యోగులకు జాగ్రత్తలు తేలపాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ విధులు కేటాయించిన ప్రొసైడింగ్ అధికారులు సహాయ ప్రొసైడింగ్ అధికారులు మైక్రో అబ్జర్వర్లకు ఈరోజు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 5వ తేదీ ఓపిఓలకు, 6వ తేదీ పోలీస్ సిబ్బంది, ఎసెన్షియల్ సర్వీసెస్, డ్రైవర్లు వీడియో గ్రాఫర్లు తదితరులకు అన్ని అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటు కలిగి ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు 6వ తేదీ జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పాండురంగ మున్సిపల్ హైస్కూల్లో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గుడివాడ రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ పి పద్మావతి, సహాయ టర్నింగ్ అధికారి, తాసిల్దార్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు
Tags gudivada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …