విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు, యువతులకు కంప్యూటర్ పై శిక్షణా తరగతులు స్థానిక వాసవ్య మహిళా మండలి లో సోమవారం ప్రారంబం అయ్యాయి. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష్యులు డాక్టర్ బి.కీర్తి మాట్లాడుతూ మహిళలు, యువతులు ఆర్థికంగా ఎదగడానికి, వారి కుటుంబానికి అండగా ఉండేందుకు కంప్యూటర్ పై శిక్షణా తరగతులను ప్రారంబిస్తున్నామని, ఇప్పుడు ఉపాది రంగంలో అధికంగా వినబడుతున్న పేర్లు జి.యస్.టి మరియు టాలి అని, దీనిపై మహిళలకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారు, కుటుంబం ఆర్థికంగా ఎదుగుదల ఉంటుందనే ఉద్దేశంతో టి.ఇ.పి.యల్ టాలి వారితో కలసి ఈ తరగతులను నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. శిక్షణ ను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు, యువతులు సద్వినియోగ పరచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఇతర వివరములకు వాసవ్య మహిళా మండలి ని గాని 8332842084 నంబరును గాని సంప్రదించవచ్చని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ సందీప్, వాసవ్య మహిళా మండలి సిబ్బంది, విధ్యార్ధులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …