Breaking News

1,128 సీ-విజిల్ ఫిర్యాదుల ప‌రిష్కారం

– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి (ఎంసీసీ) అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సీ-విజిల్ ద్వారా 1,131 ఫిర్యాదులురాగా 1,128 ఫిర్యాదుల ప‌రిష్కారం పూర్త‌యింద‌ని.. మిగిలిన‌వి పురోగ‌తిలో ఉన్నాయ‌ని జిల్లా కలెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఓట‌ర్ హెల్ప్‌లైన్‌, నేష‌న‌ల్ గ్రీవెన్స్ స‌ర్వీసెస్ పోర్ట‌ల్ (ఎన్‌జీఎస్‌పీ) త‌దిత‌ర మార్గాల ద్వారా మొత్తం 2,867 ఫిర్యాదులు రాగా 2,782 ఫిర్యాదుల ప‌రిష్కార ప్ర‌క్రియ పూర్త‌యింద‌ని, మిగిలిన‌వి పురోగ‌తిలో ఉన్నాయ‌ని వివ‌రించారు. ఓట‌రు హెల్ప్‌లైన్ (1950) ద్వారా 571 ఫిర్యాదులు రాగా 571 ఫిర్యాదుల ప‌రిష్కారం పూర్త‌యింద‌న్నారు. ఎన్‌జీఎస్‌పీ ద్వారా 911 ఫిర్యాదులు రాగా 840 ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించిన‌ట్లు తెలిపారు. అదే విధంగా వాట్సాప్ నంబ‌రు (9154970454) ద్వారా 48 ఫిర్యాదులు రాగా 46 ఫిర్యాదులు, కాల్ సెంట‌ర్ (0866-2570051) ద్వారా 27 ఫిర్యాదులు రాగా 27 ఫిర్యాదులను ప‌రిష్క‌రించిన‌ట్లు తెలిపారు. కంప్ల‌యింట్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ (సీఎంఎస్‌) ద్వారా 87 ఫిర్యాదులు రాగా 82 ఫిర్యాదుల‌ను, సీఈవో మెయిల్స్ ద్వారా 16 ఫిర్యాదులు రాగా 14 ఫిర్యాదులను ప‌రిష్క‌రించిన‌ట్లు తెలిపారు. జిల్లా ఎన్నిక‌ల అధికారి స్థాయిలో మీడియా మానిట‌రింగ్ ద్వారా 76 అంశాల‌కు సంబంధించి 74 అంశాలను పరిష్కరించినట్లు తెలిపారు. ప్ర‌తి ఫిర్యాదుపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించి నాణ్య‌త‌తో ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *