మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం రాత్రి జి కొండూరు మండలం కవులూరు, వేలగలేరు గ్రామాల్లో మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార రధం పై నుంచి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఐదేళ్ల లో రైతుల కోసం కేవలం 500 కోట్లు కూడా ఖర్చ పెట్టక పోవడం తో చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు అర్థాంతరంగా అగిపోయాయి. గడచిన ఐదేళ్ల లో తొమ్మిది సార్లు విద్యుత్ రేట్లు పెంచడం తో రాష్ట్రంలోని చిన్న మద్య తరహ పరిశ్రమలు దాదాపుగా మూతపడ్డాయి. కేవలం బటన్ నోకే సంక్షేమ పథకాలు తప్పు అబివృద్ది గురించి జగన్మోహనరెడ్డి పూర్తిగా మరిచి పోయారు. తనను కాదని బయటకు వచ్చినందుకు సిఎం జగన్ నాపై కక్ష కట్టి నన్ను ఓడించడం కోసం కోట్ల రూపాయలు వెదజల్లుతూ ఇప్పుటికే మైలవరానికి ముగ్గురు పరిశీలకులను పంపాడు. తాజగా సజ్జల కూడా మైలవరం వచ్చి రహస్య మంతనాలు జరిపి వెళ్ళాడు. ఎంత మంది వచ్చినా ఎవ్వరేన్ని కుట్రలు చేసినా ప్రజలంతా చంద్రబాబు కూటమి వైపే ఉన్నారని రానున్నది చంద్రన్న రాజ్యమని తెలిపారు. చంద్రబాబు అధికారం లోకి రాగానే ప్రజా రాజధానిగా అమరావతి తో పాటు ఉచితంగా ఇసుక, పేదలకు అన్నా క్యాంటీన్ లు ఏర్పాటుతో పాటు నాసిరకం మధ్యం బ్యాన్ చేసి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అక్కల రామ్మోహన్, బిజెపి జనసేన పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Tags mylavaram
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …