కొండపల్లి లో నిరంతరాయంగా కొనసాగుతున్న వసంత శీరిష ఎన్నికల ప్రచారం

కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రచారం లో భాగంగా గురువారం రాత్రి వంగవీటి బజార్ లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా ఆ ప్రాంత వాసులు హరతులు పట్టి అశీర్వదించి అత్మీయంగా స్వాగతించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణి చేశారు. అ ప్రాంత చిన్నారులు కోలాట నృత్య ప్రదర్శనలు చేస్తుండగా వారితో కలిసి కోలాట ప్రదర్శన చేశారు. అనంతరం వారిని అభినందించారు. ఈ నెల 13 న జరుగునున్న సార్వత్రిక ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యే గా పోటీచేస్తున్న వసంత వెంకట కృష్ణ ప్రసాదు కి ఈవియం లో 4 వ నెంబర్ లో నోక్కి సైకిల్ గుర్తు పై మీ ఓటు వేయాలని విజ్ణప్తి చేశారు. అలానే యంపి అభ్యర్థిగా పోటీచేస్తున్న కేశినేని శివనాధ్ కి ఈవియం లో 1 వ నంబర్ పై నోక్కి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో స్థానిక పార్టీ నాయకులు తెలుగు మహిళలు జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *