విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ సమగ్రాభివృద్ధి, పరిరక్షణ, సంక్షేమం కోసం ఇండియా కూటమిని అభ్యర్థులను గెలిపించాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు ఆర్.ఆర్.గాంధీ నాగరాజన్ పిలుపు నిచ్చారు. శుక్రవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో లోని పంజసెంటర్ ప్రచారం నిర్వహించారు. ఇండియా కూటమి బలపర్చిన సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఎత్తుగడలను ఎండ గట్టాలన్నారు. ప్రస్తుత ఎన్నికలు పేదలు, పెట్టుబడిదారులకు, మంచికి, చెడుకు మధ్య జరుగుతున్న పోరాటమని, ఈ పోరాటంపై ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభమైందని, ఇందులో ఇండియా కూటమి తప్పక గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జి. కోటేశ్వరరావు గెలుపు కోసం కృషి చేయాలని, అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్న బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎపి అధ్యక్షురాలు బంగారు భారతి, ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …