అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో పవన్ కళ్యాణ్ కి ఓటు ఉంది. సోమవారం ఉదయం 9 గంటలకు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహా కాలనీ, గిరిజన సహకార సంస్థలో ఏర్పాటు చేసిన బూత్ నంబర్ 197లో ఓటు వేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల ఓటు హక్కు వినియోగించుకున్నట్టు సిరా గుర్తు ఉన్న వేలును చూపుతూ అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. ప్రశాంత వాతారణంలో ఎన్నికలు జరగాలని, ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. అనా కొణిదెల కి భారత దేశంలో ఎన్నికల ప్రక్రియ, ఓటింగ్ సరళిని చూపించారు.
Tags AMARAVARTHI
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …