అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ఓటింగు ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయా ఇవిఎమ్ లని రాజమండ్రీ పార్లమెంటు, అనపర్తి అసెంబ్లి నియోజక వర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు కె. బాల సుబ్రహ్మణ్యం సమక్షంలో స్క్రూటిని కేంద్ర బలగాలు రక్షణ లో స్ట్రాంగ్ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు మంగళవారం ఉదయం స్థానిక నన్నయ్య యూనివర్సిటీ లో ఈస్ట్రరన్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో ఈ వి ఎమ్ యూనిట్స్ భద్ర పరిచిన గదులకు సీల్ వెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా మే 13 సోమవారం రోజున పాలైన ఓట్లను అనుసరించి ఈవిఎమ్ లలో పాలైన ఓట్లు , ఫారం 17 ఎ రిజిస్టర్, పి వో డైరీ 17 సి అనుసరించి స్క్రూ టిని ప్రక్రియ నిర్వహించారు. ఈమేరకు రికార్డుల నిర్వహణ, ఈ వి ఎమ్ యూనిట్స్ లో పాలైన ఓట్ల సంఖ్య టాలీ అవడం పట్ల పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ లో అనపర్తి రిటర్నింగ్ అధికారి ఎమ్. మాధురీ, రాజమండ్రి పార్లమెంటు, అనపర్తి అసెంబ్లి నియోజక వర్గాలలో పోటి చేసిన అభ్యర్థులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సంబంధిత నియోజక వర్గాల పార్లమెంటు , అసెంబ్లి నియోజక వర్గాల సమక్షంలోనే సీల్ వెయ్యడం జరిగింది.
పోస్టల్ బ్యాలెట్…
అనపర్తి మొత్తం ఓటర్లు .. 226053.. ఇవిఎమ్ ద్వారా పాలైన ఓట్లు.. 1,86,533
పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1477, ఇతర జిల్లాల్లో 447 వెరసి 1924