విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ముగిసింది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కావున విద్యార్థులు తమ ప్రిపరేషన్ ను కొనసాగిస్తే ఉద్యోగం సాధించవచ్చు. TSPSC ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్, అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష, నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్ష నిర్వహించనుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) మే 20వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈనెల 27న MLC ఎన్నిక ఉండటంతో.. ఎన్నికలకు ఇబ్బందిలేకుండా టెట్ పరీక్షల తేదీలను ఖరారు చేశారు. మే 20, 21, 22 తేదీల్లో పేపర్-2 గణితం, సైన్స్ పరీక్ష, మే 24, 28, 29 తేదీల్లో పేపర్-2 సాంఘిక శాస్త్రం పరీక్ష, మే 30, 31 తేదీల్లో పేపర్-1, జూన్ 1న పేపర్- 2 గణితం, సైన్స్ (మైనర్ మీడియం), జూన్ 2న పేపర్ -1 పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రతిరోజు రెండు సెషన్లలో టెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. జూన్ 12న టెట్ ఫలితాలను ప్రకటిస్తారు. టెట్ లో అర్హత సాధించినవారు డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా జూన్ 20వ తేదీవరకు అవకాశం ఉంది. డీఎస్సీ 2024 పరీక్షలను జులై 17 నుంచి జులై 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …