అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ సిద్ధాంతాలకు మద్దతుగా “టీం అట్లాంటా జనసేన” అందించిన సేవలు ప్రశంసనీయం. టీం అట్లాంటా జనసేన (తాజ్ ) గత కొన్ని సంవత్సరాలుగా విరాళాలు, పార్టీకి అవసరమైన వివిధ పరికరాలు సమకూర్చడంలో ముందుండి తోడ్పాటు అందించారు. అదే విధంగా పిఠాపురం నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారంలో వారు గణనీయమైన సేవలు అందించారు. “నా సేన నా వంతు” కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఉత్సాహంగా భాగస్వామ్యులు అయ్యారు.
ఖండాంతరాలు అవతల ఉన్నప్పటికీ పుట్టిన భూమికి తమ వంతుగా సేవ చెయ్యాలి అనే దృఢసంకల్పంతో ముందుకు వచ్చి జనసేన విజయం కోసం మేము సైతం అంటూ పాటుపడిన “తాజ్” టీంకి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.
Tags AMARAVARTHI
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …