నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నెల్లూరు జిల్లా వింజమూరులో తల్లీకూతురులపై దాడి ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యారు. మహిళలపై దాడులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చైర్‌పర్సన్ మహిళా కమిషన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. శనివారం నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని వారి తల్లిని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడడం జరిగిందన్నారు. వింజమూరులో తల్లి కూతుర్ల పై దాడి దారుణమన్నారు. కొంతకాలంగా యువతి ని ప్రేమిస్తున్నానంటూ వేధింపులు పాల్పడుతున్న నాగరాజు శుక్రవారం యువతి, యువతి తల్లి పై దాడి చేయడం జరిగిందన్నారు. తల్లి కూతుర్లను ఆసుపత్రికి తరలించి, ప్రభుత్వం సాయంతో చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రాణభయముతో తల్లి కూతుర్లు ఉన్నారు, వారికి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరగా పట్టుకోవాలని, శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీకి సూచించడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో వచ్చిన తర్వాతే మహిళపై దాడులు పెరిగాయన్నారు. ఈ వరుస సంఘటనపై మహిళా కమిషన్ చర్యలు చేపట్టకుండా ఈసీ ఆంక్షలు విధించడం సరికాదన్నారు. బాధితులకు మహిళా కమిషన్, ప్రభుత్వము అండగా ఉంటుంది, రక్షణ కల్పిస్తుందన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అనంతరం ప్రభుత్వ షెల్టర్ హోమ్‌కు తరలించాలని అధికారులకు సూచించారు.
Tags nellore
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …