-ఎలక్షన్ రిజల్ట్ కై అన్ని విధాల చర్యలకు సిద్దమవుతున్న ఈసి
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం లో జరుగుతున్న అల్లర్లకు చెక్ పెట్టేందుకు ఎలక్షన్ కమిషనర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే..ఐతే ఈసి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ బంక్ నిర్వాహకులకు మీటింగ్ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఎవరికీ లూస్/బాటిళ్లలో/కంటైనర్లలో కానీ ఇతర ఏ పద్ధతిలోనైనా లూస్ పెట్రోల్ అమ్మ వద్దని తెలియపరుస్తూ నోటీసులు జారీ చేసి అమలు పరిచినట్టు తెలిపారు.ఎలక్షన్ కమిషనర్ యొక్క ఆదేశాలను ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా లూస్ పెట్రోల్ అమ్మిన ఎడల వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొనబడతాయి అని వారికి ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్పెక్టర్ ఎం.సత్యనారాయణ తెలిపారు.