విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అన్నారు. జూన్ 4వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపుకు చేపట్టవలసిన ఏర్పాట్లపై ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఢిల్లీ రావు నియోజవర్గ రిటర్నింగ్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని అదేవిధంగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకరాలను పాటిస్తూ లెక్కింపు ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. ఇబ్రహీంపట్నం నోవా, నిమ్రా ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో నిరంతర నిఘాతో పటిష్టమైన మూడు అంచెల భద్రత ఉందన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లు, సీల్ వేసిన డోర్‌లు, సెక్యూరిటీ, కారిడార్లను నిరంతరం సీసీ కెమెరాల ద్వారా 24 గంటలు పర్యవేక్షించాలన్నారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులు, అనధికార వ్యక్తులు, ఇతరుల వాహనాలను స్ట్రాంగ్ రూముల పరిసరాలలో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు. స్ట్రాంగ్ రూముల నుండి లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి ప్రత్యేక మార్గాలు ఉండాలన్నారు. బ్యారికెడ్లు, మెష్ లు, చైర్ల ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపుకు కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, ఇతర లెక్కింపు సిబ్బంది వివరాలను సిద్ధం చేసుకోవాలన్నారు. లెక్కింపు కేంద్రంలో14 టేబుల్స్ అసెంబ్లీకి, పార్లమెంటుకు 14 టేబుల్స్ చొప్పున 28 టేబుల్స్ తో పాటు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు ప్రత్యేక టేబుల్స్ ఏర్పాటు ఉండాల ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, వి ఎం సి కమిషనర్ స్వప్నల్ దినకర్ ఫుట్కర్, డిఆర్ఓ వి. శ్రీనివాసరావు, నియోజవర్గ రిటర్నింగ్ అధికారులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …