-ఎయిడ్స్ బాధిత కుటుంబాలకు అండగా నిలుద్దాం.. జిల్లా రెవెన్యూ అధికారి వి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా రూపుమాపడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి చేయడంతోపాటు ఎయిడ్స్ బాధిత కుటుంబాలకు అండగా ఉందామని జిల్లా రెవెన్యూ అధికారి వి.శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవ సందర్భంగా ఆదివారం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో కలిసి కొవ్పొత్తులను వెలిగించి ఎయిడ్స్ వ్యాధితో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. అనంతరం ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనలో భాగస్వామ్యులు అవుదామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిలా రెవిన్యూ అధికారి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా రూపుమాపడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. హెచ్ఐవి పై ప్రజలలో అవగాహన కల్పించి నివారణ చర్యలు చేపట్టడమే వ్యాధి నిర్మూలనకు ఎకైక మార్గం అన్నారు. ఎయిడ్స్ వ్యాధి బారిన పడి అనేక మంది అమూల్యమైన ప్రాణాలను కొల్పొడమే కాక వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేశారన్నారు. ఎయిడ్స్ వ్యాధితో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా మే నెల 3వ ఆదివారం కొవ్వొతులను వెలిగించి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు.
జిల్లాలో ఎయిడ్స్ నివారణ అధికారి ఉషారాణి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి కారణంగా జిల్లాలో గత ఏడాది 661 మంది మృతి చెందారన్నారు ఎయిడ్స్ వ్యాధి బాధితులు, బాధిత కుటుంబాలకు సంఘీబావం తెలుపి ప్రభుత్వ పరంగా అన్ని విధాల అదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 7 హెచ్ఐవి నిర్ధారణ కేంద్రాల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని 75 ప్రభుత్వ ఆసుపత్రులు 10 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులతో హెచ్ఐవి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. జిల్లాలో హెచ్ఐవ గ్రస్తులను గుర్తించి వారికి మెరుగైన వైద్య సహాయంతో పాటు పౌష్టికాహారం అందించడం వలన వ్యాధి తగ్గుముఖం పట్టిందన్నారు. హెచ్ఐవి బాధితులకు జీవిత కాలం ఉచిత ఏఆర్జి మందులను పంపిణీ చేస్తున్నామని రెండు ఏఆర్టి సెంటర్లు ఐదు అనుబంధ ఏఆర్టీ సెంటర్ల ద్వారా సేవలందిస్తున్నారన్నారు. జిల్లాలో 17505 మంది హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు వున్నారని వీరిలోషుమారు 1800 కి ప్రతి నెల 2,250 రూపాలయలను ఆర్థిక సహాయం కింద వారి ఖాతాలలో జమ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో రెడ్ రెబ్బన్ క్లబ్లను ఏర్పాటు చేసి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల యువతకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలలో చైతన్యం కల్పించడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కళాజాతాల ప్రదర్శనలు కరపత్రాలు, గోడపత్రాల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నామన్నారు. ఎయిడ్స్ వ్యాధి భాధిత కుటుంబాలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవా కార్యకర్తలు ముందుకు రావాలని ఆమె కోరారు
అనంతరం బలమైనా సమాజ నిర్మాణానికి హెచ్ఐవి వ్యాధితో జీవిస్తున్నావారిపట్ల ప్రేమతో సంఘీబావం తెలుపుతానని భాధ్యత కలిగిన పౌరునిగా పరిపూర్ణ చైతన్యం అవగాహనలతో భాధ్యతాయుతమైన ప్రవర్తనతో హెచ్ఐవి /ఎయిడ్స్ వ్యాధిని అరికట్టేందుకు మనసావాచా.. కర్మణ తో ముందుంటానని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిపియం పి. కిరణ్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కో-ఆర్డినేటర్ ఆరవ రమేష్ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సమాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.