విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ విపత్త్తు నిర్వహణ సంస్థ వారు భారత్ స్కౌట్స్ & గైడ్స్ సంస్థలో శిక్షణ పొందిన యువతి యువకులకు (18 సంవత్సరముల నుండి 40 సంవత్సరములలోపు ఉన్న వారికీ) యువ ఆపద మిత్ర అను పధకమును ప్రవేశపెట్టియున్నారు. దీని యొక్క ఉద్దేశ్యం మీ మీ సమీప ప్రాంతములలో ప్రకృతి వైపరీత్యాలు (వరదలు, భూకంపాలు, సునామీ వంటివి) సంబవించినప్పుడు జాతీయ విపత్త్తు నిర్వహణ సంస్థతో పాటు సహాయము చేయుట కొరకు, దీని కొరకు జాతీయ విపత్త్తు నిర్వహణ సంస్థ వారు ఆసక్తి కల యువతి యువకులకు ఒక 7 రోజులు శిక్షణ శిబిరమును నిర్వహిస్తారు. శిక్షణ పూర్తి చేసిన యువతీ యువకులకు – అత్యవసర పరికరముల కిట్ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసిన యువతీ యువకులను 3 సంవత్సరముల Life and Health Insurance చేస్తారు .
కావలసిన అర్హతలు
1. 18 నుండి 40 సంవత్సరముల వయస్సు కలవారై ఉండవలెను .
2. సంబంధిత జిల్లా వాసి అయి ఉండవలెను .
3. కనీసం 7 వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలెను
4. శారీరక మరియు మానసిక దృఢత్వం కలవారై ఉండవలెను
ఇది పూర్తిగా స్వచ్చంధంగా చేయు సేవా మాత్రమే
కావున అందరూ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు కళాశాలల ప్రధానాచార్యులు “మీ మీ పాఠశాలలో స్కౌట్స్ & గైడ్స్ శిక్షణ పొంది ప్రస్తుతము కళాశాలలలొ చదువుతున్న పూర్వ విద్యార్థులందరికీ పై సమాచారం తెలియచేసి ఆసక్తి కల విద్యార్థులను ‘యువ ఆపద మిత్ర పధకము’ నందు ఆన్లైన్లో నమోదు చేసుకోవలసిందిగా తెలియచేయటమైనది.
link
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeTQFjAI3AqO3-jDfx2FezevE3sDTKWyDi3P7FUqwGnVk2xSQ/viewform?pli=1
యస్. సురేష్ కుమార్ ,ఐఏఎస్, స్టేట్ చీఫ్ కమిషనర్ మరియు జి.భానుముర్తి రాజు, స్టేట్ సెక్రటరీ భారత్ స్కోట్స్ &గైడ్స్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ప్రకటన ద్వారా తెలియజేశారు.