ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం, అన్నవరం, తూర్పు గోదావరి జిల్లా యందు వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవములు -2024 సందర్భంగా ఈరోజు శ్రీ స్వామివారికి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, ఇంద్రకీలాద్రి తరపున గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ సత్యనారాయణ, ఐఏఎస్ చేతుల మీదుగా పట్టు వస్త్రములు సమర్పించుట జరిగినది. ఈ సందర్బంగా వీరు ఆలయ అర్చక బృందంతో కలిసి అన్నవరం దేవస్థానం చేరుకోగా ఆలయ కార్యనిర్వహణాధికారి (అన్నవరం) రామచంద్ర మోహన్ ఆలయ మర్యాదలతో మంగలవాయిద్యముల నడుమ స్వాగతం పలికి వీరు శ్రీ సత్యనారాయణ స్వామివారి, అనంత లక్ష్మి సత్యవతి దేవి అమ్మవారి దర్శనము కల్పించారు. అనంతరం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం తరపున స్వామి వారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలు కమీషనర్ చేతుల మీదుగా సమర్పించడం జరిగినది. అనంతరం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం వేదపండితులు వీరికి వేద ఆశీర్వచనము చేయగా, కార్యనిర్వహణాధికారి (అన్నవరం) వీరికి స్వామివార్ల శేషవస్త్రములు మరియు ప్రసాదములు అందజేసినారు. ఈ కార్యక్రమములో ఆలయ సహాయ కార్యనిర్వాహనాధికారి బి వెంకటరెడ్డి, వైదిక సిబ్బంది మార్తి యజ్ఞనారాయణ, ఓగెటి రమేష్ బాబు, ఉండి శ్రీనివాస్ శాస్త్రి మరియు వేదపండితులు ఉపాధ్యాయుల సుబ్రహ్మణ్య ఘనపాటి, తంగిరాల వెంకటేశ్వర ఘనపాటి మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
Tags indrakiladri
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …