Breaking News

జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలయ్యే కార్యక్రమాలు ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టర్ సమావేశం నిర్వహించి వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మ సేద్య, నాచురల్ ఫార్మింగ్, పట్టు పరిశ్రమ, మత్స్య శాఖల కార్యక్రమాలపై సమీక్షించారు. తొలుత జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి జిల్లాలో సాగు భూములు, వాటి విస్తీర్ణం, నేలల స్వభావం, పండే పంటలు వాటి విస్తీర్ణం, భూగర్భ జలాల లభ్యత, కాలువలు, లిఫ్ట్ ఇరిగేషన్, చెరువుల ద్వారా సాగవుతున్న విస్తీర్ణం తదితర అంశాలు కలెక్టర్కు వివరించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా రైతులకు గతంలో మాదిరిగా అవసరమైన ఎరువులు విత్తనాలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో వరి విత్తన రకాలు, రైతులు ఎక్కువగా సాగు చేస్తున్న రకాల గురించి వ్యవసాయ శాస్త్రవేత్త గిరిజారాణి వివరించారు. ఆయా నేలల స్వభావాన్ని బట్టి అధిక దిగుబడులను ఇచ్చే రకాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ఉద్యాన పంటల సాగు వాటి విస్తీర్ణం గురించి జిల్లా ఉద్యాన శాఖ అధికారి జే.జ్యోతి వివరించారు.

నాచురల్ ఫార్మింగ్ జిల్లా ప్రాజెక్టు అధికారి పార్థసారథి జిల్లాలో న్యాచురల్ ఫార్మింగ్ కార్యక్రమాలు కలెక్టర్కు వివరించారు. న్యాచురల్ ఫార్మింగ్ జిల్లాలో ప్రమోట్ చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలయ్యాక వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రతిరోజు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించాలని సంబంధిత అధికారులకు సూచిస్తూ, 15 రోజులకోసారి తాను సమీక్షిస్తానని అన్నారు. వారి శాఖలకు చెందిన ప్రగతి సూచికలలో ఉత్తమ స్థానంలో ఉండేలా చూడాలని, చివరి స్థానం కాకూడదని అన్నారు. ఆయా శాఖలలో ఏవైనా కోర్టు కేసులు ఉంటే ఆలస్యం కాకుండా సకాలంలో కౌంటర్లు వేయాలన్నారు.

ఈ సమావేశంలో జిల్లా సూక్ష్మ సేద్య అధికారి జి విజయలక్ష్మి, మత్స్యశాఖ జేడీ శివ సామ్రాజ్యం, మార్క్ఫెడ్ డి ఎం మురళి కిషోర్ తదితరులు పాల్గొన్నారు

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *