విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరు రోడ్డు అప్సర థియేటర్ సమీపంలో ఫర్నిచర్ డీలక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని బుధవారం రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. రోజురోజుకి వేసవి తాపం పెరిగిపోతుండటంతో అధిక ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ మజ్జిగ చలివేంద్రంను ఏర్పాటు చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. స్థానికులతోపాటు నగరానికి ఇతర ప్రాంతాల నుండి రాకపోకలు సాగించే ప్రయాణీకుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో దామోదర్, సాయిబాబా, రాంబాబు, యల్లాప్రగఢ సుధీర్, కృష్ణకిషోర్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …