Breaking News

మే 23 బుద్ధ పూర్ణిమ… బుద్ధుడు చెప్పింది విందాం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మే 23 బుద్ధ పూర్ణిమ… భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ కు బుద్ధుడు బోధనలు స్ఫూర్తిగా నిలిచాయి. అహింస ద్వారానే ఏదైనా సాధించగలమని బుద్ధుడు పలుమార్లు చెప్పారు. గౌతమ బుద్ధుడు 29 సంవత్సరాల వయస్సులో సన్యాసం తీసుకున్నారు 6 సంవత్సరాల పాటు ఆయన కుటుంబానికి దూరంగా ఉన్నారు. ఆయన ఆచరించిన సత్యం, అహింస, ధర్మం, దయ కోసం ప్రజలను ప్రేరేపించారు. ఆ మార్గాన్ని అనుసరించడానికి బౌద్ధమతాన్ని స్థాపించారు. బౌద్ధమతాన్ని స్కీకరించిన ప్రజలు తెల్లని దుస్తువులను ధరించి..శాంతికి ప్రతిరూపాలుగా ఉంటారు. ఈరోజున కేవలం ఖీర్ మాత్రమే తింటారు. బుద్దుడికి ఒక మహిళ ఒక గిన్నెలో పాలు మాత్రమే సమర్పించిందని చెబుతుంటారు. ఈరోజున బౌద్దులు చుట్టుపక్కల వర్గాల నుంచి పగోడాల వరకు రంగు రంగుల పల్లకిలలో ఉరేగింపులు నిర్వహిస్తారు. అలాగే బోధి చెట్టు మొదట్లో నీరు పోసి.. నైవేధ్యం సమర్పిస్తారు. అక్కడే ధ్యానం చేస్తారు. బుద్ద పూర్ణిమ సందర్భంగా బీహార్ లోని బోధ్ గయాలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మహా బోధి ఆలయాన్ని చాలా మంది భక్తులు సందర్శిస్తారు. ఇక్కడే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెబుతుంటారు.

గౌతముడు అనారోగ్యం, వృద్ధాప్యం, మృత్యువు లాంటి దుఃఖాలను చూసి చలించిపోయారు. కష్టాలకు కారణం ఏమిటో అన్వేషిస్తూ కుటుంబాన్ని వదిలి వెళ్లారు. దేశాటన చేస్తూ, ఎంతో శోధించిన మీదట, చివరికి గయలో, బోధివృక్షం కింద ”కోరికలే దుఃఖానికి మూల కారణం” అని ఆయనకు బోధపడింది. తాను కనుగొన్న నగ్నసత్యాన్ని ప్రచారం చేశారు బుద్ధుడు. ‘మనకు కష్టం కలుగుతోంది, దుఃఖిస్తున్నాము అంటే అందుకు ఏదో ఒక కోరికే కారణం. కనుక కోరికలను జయించమని ప్రబోధించారు. లోకంలో ఏదీ శాశ్వతం కాదు, ప్రతిదీ మార్పు చెందుతుంది, చివరికి నశించిపోతుంది. మార్పు సహజం కనుక దాన్ని ఆమోదించాలి. మంచి, చెడు దేనికీ ప్రతిస్పందించవద్దు ‘ – బుద్ధుని ఈ బోధనలు ఉన్నతమైనవి, ఉత్కృష్టమైనవి.

బుద్ధుని అనుచరులు మనదేశంలోనే కాదు, ప్రపంచమంతా ఉన్నారు. శ్రీలంక, బర్మా, థాయిలాండ్, టిబెట్, చైనా, కొరియా, వియత్నాం, మంగోలియా, భూటాన్, కాంబోడియా, నేపాల్, జపాన్ -కెనడా ఇలా ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నారు. ఈ రోజు వారంతా పండుగ చేసుకుంటారు. బుద్ధ పూర్ణిమ రోజున రాగల్గినవారు బోధగయకు రాగా, తక్కినవారు ఉన్నచోటే ఉత్సవం చేసుకుంటారు. బుద్ధుడు తొలిసారి తన బోధనల్లో సమానత్వం అనే భావనను ప్రవేశ పెట్టారు. మానవత్వానికి ప్రాముఖ్యతను ఇచ్చారు. దేనిని గుడ్డిగా నమ్మవద్దని చెప్పారు. జీవ హింసని వ్యతిరేకించారు. వ్యక్తిగత ఆరాధన వద్దన్నారు. నైతిక విలువలు ఆధారంగా ఎంతైనా సంపాదించుకోవచ్చని తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం, అహింస అనేవి బుద్ధుని బోధనలలో ప్రధానమైనవి. ఈ సూత్రాల ఆధారంగానే ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తుంది.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *