Breaking News

జూన్‌ 4న ఓట్ల లెక్కింపుకు అన్ని విధాల సన్నద్దం…

-ఈసిఐ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పాటిస్తూ ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్దం చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ డిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు వివరించారు. సాధారణ ఎన్నికలలో భాగంగా కౌంటింగ్‌ కేంద్రాలలో చేపట్టవలసిన ఏర్పాట్లపై సచివాలయం నుండి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

నగరంలోని క్యాంప్‌ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ జూన్‌ 4వ తేదీన చేపట్టనున్న ఓట్ల లెక్కింపుకు అన్ని విధాల సన్నద్దంగా ఉన్నామని, ఎన్నికల కమీషన్‌ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే స్టాంగ్‌ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతతో కట్టుదిట్టంగా సిసి కెమెరాల నిఘాతో నిరంతరం అప్రమత్తంగా ఉన్నామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలు స్టాంగ్‌ రూములు ఉన్న నోవా, నిమ్రా ఇంజనీరింగ్‌ కళాశాలల వద్ద ఒక కంపెనీ సెంట్రల్‌ రిజర్వడ్‌ పోలీస్‌ ఫోర్స్‌, 156 మంది స్పెషల్‌ ఆర్మడ్‌ పోలీస్‌ ఫోర్స్‌, 477 మంది సివిల్‌ పోలీస్‌ ఫోర్స్‌తో పాటు 149 సిసి కెమెరాలను మానిటరింగ్‌ రూమ్‌కు అనుసందానం చేసి రోజు వారి నిరంతర పర్యవేక్షణతో భద్రత కల్పించామన్నారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎప్పటికప్పుడు సమచారం అందించేందుకు వీలుగా మీడియా సెంటర్‌తో పాటు, అభ్యర్థులు, ఏజెంట్లకు తెలిపే విధంగా పబ్లిక్‌ కమ్యూనికేషన్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలలో బ్యారీ కేడిరగ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్‌ బ్యాలెట్‌, ఈవియంల కౌంటింగ్‌నకు అడిషనల్‌ ఏఆర్‌వోలు, కౌంటింగ్‌ సూపర్వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. ఈనెల 27వ తేదీన ఓట్ల లెక్కింపు పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు. నోవా, నిమ్రా కళాశాలలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన పార్లమెంట్‌, అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు కౌంటింగ్‌ హాల్స్‌లో పార్లమెంట్‌, అసెంబ్లీకి ఒక్కొక్కదానికి 14 టెబుల్స్‌ చొప్పున ఏర్పాటు చేసున్నామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుకు పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా టెబుల్స్‌ ఏర్పాటు చేసి కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల నిబంధనలను పాటిస్తూ సజావుగా, సక్రమంగా, ప్రశాతంగా నిర్వహించేందుకు అన్ని విధాల సన్నద్దంగా ఉంటూ పకడ్బందిగా ఏర్పాట్లు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ డిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు వివరించారు.

కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌, మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి డా. పి. సంపత్‌ కుమార్‌, డిఆర్‌వో వి. శ్రీనివాసరావు, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి, డిఆర్‌డిఏ పిడి కె. శ్రీనివాసరావు ఉన్నారు.

Check Also

ప్రత్యేక హెూదా కోసం పవన్ కల్యాణ్ పోరాడాలి… : నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి ప్రత్యేక హెూదాతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ఒప్పించేందుకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *