విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఉదయం మల్లికార్జున్ పేటలో ఉన్న మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తాగునీటి సరఫరా చేసే హెడ్ వాటర్ వర్క్స్ లో నమూనా తీసి, నగరం లోని అన్నిప్రాంతాలలో ఉన్న వివిధ ఇళ్ల నుండి త్రాగునీటి నమూనాలను తీసి పరీక్షలు నిర్వహించారని, అక్కడున్న ఇంజనీర్లతో మరియు సీనియర్ ల్యాబ్ అసిస్టెంట్లను సంప్రదింపులు చేసి త్రాగునీటిలో వచ్చే రంగు మార్పుల వల్ల ఎటువంటి అనారోగ్యం కలగదని నిర్ధారించారని, అయినప్పటికీ త్రాగునీటిలో వచ్చిన రంగు మార్పు గురించి శ్రద్ధ తీసుకొని ఆక్టివేటెడ్ చార్కోల్ ట్రీట్మెంట్ అనుసరింస్తున్నామని అన్నారు. తాగునీటి సరఫరా దగ్గర నుండి పైపుల్లో పంపిణీ అయినా సరే ప్రజల ఇంటి వద్ద వచ్చే కుళాయిల నీటి వరకు నీటి శుద్ధత విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాతావరణం లో మార్పులు వల్ల ప్రజల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని కాచిన నీరుని తాగాలని ప్రజలను కోరారు. ఈ పర్యటనలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నారాయణమూర్తి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …