విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ ఏడాది వేసవిలో రాను రాను పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దరిమిలా కళాశాలలకు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల వేసవి సెలవులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ శుక్రవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఓ పక్కన విజయవాడలో కలుషిత తాగునీరు ప్రజలు ప్రాణాలు తీస్తున్నాయి. మరోవైపు సూర్య భగవానుడు తీవ్ర ఉగ్రరూపం దాల్చిన చందంగా ఎండలు భగ భగ మండుతున్నాయి. ఇలాంటి తరుణంలో స్కూళ్లు కాలేజీలు పునప్రారంభం జరిగితే, ఏ స్థాయి విద్యార్థులైనా వడదెబ్బకి గురయ్యే ప్రమాదం ఉందనీ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిప్పులు చెరుగుతున్నఎండలు తగ్గేవరకూ పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించవద్దని, వాతావరణం మార్పులు చెంది చల్ల బడిన తరువాత ప్రారంభించమని తన ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఈ లోపు కరెంట్ కోతలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ కోరారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …