Breaking News

ప్రెస్ క్లబ్ లో ఘనంగా కృష్ణ జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ సినీ నటుడు కృష్ణ 81వ జయంతి వేడుకలు గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ పాల్గొని కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమాస్కోపు, 70 ఎం ఎం ప్రవేశపెట్టి అల్లూరి సీతారామరాజు సినిమాతో అందరి హృదయాల్లో చిరస్థాయిగా స్థానం కల్పించుకున్న కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. అన్ని రకాల పాటలు, కౌబాయ్, అన్ని రకాల పాత్రలు పోషించి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ జయంతి కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన తుపాకుల కృష్ణ, సుధాకర్ రెడ్డి లను అభినందించారు. ఐజేయు నాయకులు షేక్ బాబు మాట్లాడుతూ దేవదాసు మరో దేవదాసు చరిత్ర సృష్టించిన కృష్ణ ఎప్పటికీ సూపర్ స్టార్ ఏ అన్నారు. రాజకీయరంగంలో రాణించి తనదంటూ ముద్ర వేసుకున్నారన్నారు. అక్షర కృష్ణ ఏపీ బ్యూరో చీఫ్ కె ఎస్ ఎన్ ఆర్ శర్మ మాట్లాడుతూ తొలి చిత్రం తేనె మనసులు తేనె మనసులతో పులకరించి శ్రీ శ్రీ సినిమాతో ప్రస్థానం ముగించి క్రైం, కౌబాయ్, జానపద, సాంఘిక, పౌరాణిక, రాజకీయ చిత్రాల్లో ఎందరో అగ్ర నటులు ఉన్నా గాని వారితో నేను సరి సమానం అంటూ నిరూపించిన సూపర్ స్టార్ కృష్ణ అన్ని రంగాల్లో రాణించిన వ్యక్తి అని కొనియాడారు. పౌరాణికంలో దానవీరశూరకర్ణ కు కురుక్షేత్రాన్ని చూపించి అల్లూరి సీతారామరాజు ఎప్పుడు తీస్తారు అని ఎన్టీఆర్ ని అడిగి తన చిత్ర నిర్మాణాన్ని పూర్తిచేసుకుని తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ నాయకత్వంలో ప్రెస్ క్లబ్ లో కార్యక్రమం జరగడం మరో డేరింగ్ అని అన్నారు. కృష్ణ అభిమానులు నాడు నేడు రేపు మారకుండా ఎప్పుడు ఉన్నారని కృష్ణకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *