అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళా శాసనము లతో విజయకీలాద్రి దివ్యక్షేత్రం లో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో ఆఖరి రోజున శనివారం ఆంజనేయ స్వామికి ఉదయం 9:00 గంటలకు పంచామృతాలతో (తిరుమంజనం) అభిషేకం అనంతరం మన్యసూక్త హోమం , విశేష అలంకరణ , పూర్ణాహుతి, తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికీ అష్టోత్తర శతనామార్చన , వడమాలసేవ , అనంతరం మంగళాశాసనం తీర్ధ ప్రసాద గోష్టి తో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్వరలో అంగరంగ వైభవంగ అభయ ఆంజనేయ స్వామి వారి ఎతైన ఏకశిలా మూర్తి ప్రాణప్రతిష్ట పూర్తిచేసుకొని అందరికి దర్శనం ఇస్తారు అని తెలిపారు . ఎంతో మంది భక్తులు హనుమత్జయంతి ఉత్సవాలలో పాల్గొని , ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందారు.
Tags AMARAVARTHI
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …