Breaking News

కౌంటింగ్ సిబ్బంది కి శిక్షణ కార్యక్రమం

-కౌంటింగ్ విధి విధానాలు పై అవగాహన కల్పించిన కలెక్టర్

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
కౌంటింగ్ సిబ్బంది విధులు నిర్వహించే క్రమంలో చక్కటి పనితీరు కనపర్చాలని , సమన్వయం చేసుకోవడం కీలకం అని జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత పేర్కొన్నారు.

ఆదివారం స్థానిక నన్నయ్య యూనివర్సిటీ లో కౌంటింగ్ సిబ్బంది క్షేత్ర స్థాయి శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, జూన్ 4 వ తేదీ మంగళవారం కౌంటింగ్ విధుల్లో పాల్గొనే అధికారులను, సిబ్బందిని తొలి ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేశామన్నారు. ఎన్నికల పరిశీలకులు సమక్షంలో రెండవ ర్యాండమైజేషన్ చేసి, నియోజక వర్గాల వారీగా కేటాయించినట్లు తెలిపారు. కౌంటింగ్ రోజున ఈ వి ఎమ్ యూనిట్స్ ద్వారా పోలైనా ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లు లెక్కింపు కోసం శిక్షణ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకునే క్రమంలో కౌంటింగ్ ప్రక్రియపై నేడు శిక్షణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. జూన్ 4 వ తేదీ ఉదయం 5 గంటలు తదుపరి నియోజక వర్గం లో నిర్దేశించిన కౌంటింగ్ టేబుల్స్ కి అధికారులని సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా బృందాలుగా సాంకేతిక పరమైన విధానంలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ సందర్భంలో మీ మీ బాధ్యతలు నిర్వర్తించడం పైనే దృష్టి పెట్టాలని, తద్వారా త్వరితగతిన అనుకున్న సమయం లోగా కౌంటింగ్ పూర్తి చెయ్యడం సాధ్యం అవుతుందని మాధవీలత తెలియ చేశారు. కౌంటింగ్ చేసే వారి మధ్య సమన్వయం, పరస్పర అవగాహన కలిగి ఉండడం కీలకం అని స్పష్టం చేశారు. ఏదైన సందేహాలు ఉంటే నివృత్తి చేసేందుకు అందుబాటులో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి ఉండడం జరుగుతుందనీ అన్నారు. పార్లమెంటు నియోజక వర్గ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ కోసం స్ధానిక పరిపాలన భవనం లో 15 టేబుల్స్ ఏర్పాటు చేశామని, మొత్తం పోలైన సుమారు 15300 ఓట్లను కౌంటింగ్ కు ముందుగానే సమానంగా అన్ని టేబుల్స్ లకీ అందజేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, కే ఆర్ సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. కృష్ణ నాయక్, ట్రైనీ డిప్యూటి కలెక్టర్ ఎం భాను ప్రకాష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *