-కౌంటింగ్ విధి విధానాలు పై అవగాహన కల్పించిన కలెక్టర్
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
కౌంటింగ్ సిబ్బంది విధులు నిర్వహించే క్రమంలో చక్కటి పనితీరు కనపర్చాలని , సమన్వయం చేసుకోవడం కీలకం అని జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత పేర్కొన్నారు. ఆదివారం స్థానిక నన్నయ్య యూనివర్సిటీ లో కౌంటింగ్ సిబ్బంది క్షేత్ర స్థాయి శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, జూన్ 4 వ తేదీ మంగళవారం కౌంటింగ్ విధుల్లో పాల్గొనే అధికారులను, సిబ్బందిని తొలి ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేశామన్నారు. ఎన్నికల పరిశీలకులు సమక్షంలో రెండవ ర్యాండమైజేషన్ చేసి, నియోజక వర్గాల వారీగా కేటాయించినట్లు తెలిపారు. కౌంటింగ్ రోజున ఈ వి ఎమ్ యూనిట్స్ ద్వారా పోలైనా ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లు లెక్కింపు కోసం శిక్షణ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకునే క్రమంలో కౌంటింగ్ ప్రక్రియపై నేడు శిక్షణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. జూన్ 4 వ తేదీ ఉదయం 5 గంటలు తదుపరి నియోజక వర్గం లో నిర్దేశించిన కౌంటింగ్ టేబుల్స్ కి అధికారులని సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా బృందాలుగా సాంకేతిక పరమైన విధానంలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ సందర్భంలో మీ మీ బాధ్యతలు నిర్వర్తించడం పైనే దృష్టి పెట్టాలని, తద్వారా త్వరితగతిన అనుకున్న సమయం లోగా కౌంటింగ్ పూర్తి చెయ్యడం సాధ్యం అవుతుందని మాధవీలత తెలియ చేశారు. కౌంటింగ్ చేసే వారి మధ్య సమన్వయం, పరస్పర అవగాహన కలిగి ఉండడం కీలకం అని స్పష్టం చేశారు. ఏదైన సందేహాలు ఉంటే నివృత్తి చేసేందుకు అందుబాటులో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి ఉండడం జరుగుతుందనీ అన్నారు. పార్లమెంటు నియోజక వర్గ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ కోసం స్ధానిక పరిపాలన భవనం లో 15 టేబుల్స్ ఏర్పాటు చేశామని, మొత్తం పోలైన సుమారు 15300 ఓట్లను కౌంటింగ్ కు ముందుగానే సమానంగా అన్ని టేబుల్స్ లకీ అందజేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, కే ఆర్ సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. కృష్ణ నాయక్, ట్రైనీ డిప్యూటి కలెక్టర్ ఎం భాను ప్రకాష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.రాజానగరం, తేదీ: 2.6.2024
కౌంటింగ్ సందర్భంలో రౌండ్ వారీగా ఫలితాలు ప్రకటన, గెలుపొందిన అభ్యర్ధుల ప్రకటన చేసే క్రమంలో నిబ్బరంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత పేర్కొన్నారు.
సోమవారం మధ్యాహ్నం నన్నయ్య యూనివర్సిటీ లో ఆర్ వో లు, సహయ రిటర్నింగ్ అధికారులుతో కౌంటింగ్ రోజున నిర్వర్తించాల్సిన విధులు బాధ్యతలు పై సమీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, కౌంటింగ్ రోజున ఈ వి ఎమ్ యూనిట్స్ లలో పొలైన ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లు లెక్కింపు సందర్భంలో ఆర్వో లు , ఏఆర్వో లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు ఖచ్చితంగా వ్యవహరించాల్సి ఉంటుందనీ అన్నారు. లెక్కింపు ప్రక్రియ లో ఏజెంట్స్ అభ్యంతరాలు వ్యక్తం చేసే క్రమంలో వాస్తవ పరిస్థితిని వివరించి లెక్కింపు సజావుగా సాగేందుకు సమయోచితంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంలో అనుసరించాల్సిన విధానంపై ఎన్నికల కమీషన్ పలు మార్లు సర్క్యులర్ లు పంపారని ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకోవాలి అని పేర్కొన్నారు.
అనంతరం సెంట్రల్ లైబ్రెరీ లో ఏర్పాటు చేసిన మీడియా విభాగం లో ఏర్పాటు చేస్తున్న డిజిటల్ స్క్రీన్స్, తదితర ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తో కలిసి పరిశీలించి తగిన సూచనలు చెయ్యడం జరిగింది.
రాజమండ్రీ రూరల్ ఆర్వో జె సి – ఎన్. తేజ్ భరత్, రాజమండ్రి అర్బన్ ఆర్వో, మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్, కొవ్వూరు ఆర్వో , సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ , డి ఆర్వో జీ. నరసింహులు, రాజానగరం ఆర్వో/ ఆర్డీఓ ఏ. చైత్ర వర్షిణి, గోపాలపురం ఆర్వో – కె ఎల్ శివజ్యోతి, అనపర్తి ఆర్వో ఎమ్. మాధురీ, నిడదవోలు ఆర్వో ఆర్.వి.రమణా నాయక్ , రాజమండ్రీ పార్లమెంటు సహయ రిటర్నింగ్ అధికారి – ఎస్.డి.సి. ఆర్.కృష్ణా నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎమ్. భాను ప్రకాష్, పి. సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.