Breaking News

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించిన స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపధ్యంలో ఇబ్రహీంప‌ట్నం మండ‌లం, జూపూడిలోని నోవా కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీ, నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాల‌జీ నందు ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ను అత్యంత పార‌ద‌ర్శకంగా, జ‌వాబుదారీత‌నంతో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు మరియు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు మరియు విమర్శలకు తావులేకుండా అన్ని శాఖల సమన్వయంతో సమర్ధవంతంగా మరియు పకడ్బందీగా ప‌టిష్ట ప్రణాళిక‌తో ఏర్పాటు చేసిన బందోబస్త్ ఏర్పాట్లను ఈ రోజు స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా, ఐపీఎస్ (రిటైర్డ్), స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ ఎస్.భాగ్చి ఐ.పి.ఎస్., ఎన్.టి.ఆర్.జిల్లా ఇన్ చార్జ్, ఐ.జి. చారు సిన్హా ఐ.పి.ఎస్. పరిశీలించారు.

ఈ నేపధ్యంలో పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి. రామకృష్ణ ఐ.పి.ఎస్., జిల్లా కలెక్టర్  డిల్లీరావు ఐ.ఏ.ఎస్. అధికారులకు స్వాగతం పలికి కౌంటింగ్ ఏర్పాట్లు మరియు బందోబస్త్ ఏర్పాట్ల గురించి వివరిచడం జరిగింది. ఈ నేపధ్యంలో స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా, ఐపీఎస్ (రిటైర్డ్), స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ ఎస్.భాగ్చి ఐ.పి.ఎస్. కౌంటింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు భద్రతా చ‌ర్యల‌పై అధికారుల‌కు పలు సలహాలు మరియు సూచ‌న‌లిచ్చారు. అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ మరియు కంట్రోల్ రూమ్ లను పరిశీలించి, సి.సి.కెమెరాల పనితీరును పరిశీలించి ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు మరియు విమర్శలకు తావులేకుండా అన్ని శాఖల సమన్వయంతో సమర్ధవంతంగా మరియు పకడ్బందీగా ప‌టిష్ట ప్రణాళిక‌తో కౌంటింగ్ బందోబస్త్ విధులు నిర్వహించాలని అధికారులకు పలు సూచనలు మరియు సలహాలను అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా, ఐపీఎస్ (రిటైర్డ్), స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్ ఎస్.భాగ్చి ఐ.పి.ఎస్., ఎన్.టి.ఆర్.జిల్లా ఇన్ చార్జ్, ఐ.జి. చారు సిన్హా ఐ.పి.ఎస్., పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి. రామకృష్ణ ఐ.పి.ఎస్., జిల్లా కలెక్టర్  డిల్లీరావు ఐ.ఏ.ఎస్., డి.సి.పి. అధిరాజ్ సింగ్ రాణా ఐ.పి.ఎస్., మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *