రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో కౌంటింగ్ సందర్భంలో ఏర్పాట్లను ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులు కమల్ కాంత్ కరోచ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత తో కలిసి పరిశీలనా చేశారు. సోమవారం స్ధానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో నిడదవోలు అసెంబ్లి నియోజక వర్గం పరిధిలో కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, నిడదవోలు అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో ఈవిఎమ్ ద్వారా పోలైన ఓట్లు “ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ దిగువ అంతస్తు” లో పార్లమెంటు సిగ్మెంట్ ఈవిఎమ్ ఓట్లు రూం నెంబర్ సి సి 101 /ఏ లో (14 టేబుల్స్ ) , అసెంబ్లి సిగ్మెంట్ లలో ఈవిఎమ్ ఓట్లు సీసీ 108/ఏ (14 టేబుల్స్ ) , పోస్టల్ బ్యాలెట్ ఓట్లు (3 టేబుల్స్) ద్వారా లెక్కింపు ప్రక్రియ కోసం ఏర్పాట్లు చేశామని తెలిపారు. కలెక్టర్ వెంట నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఆర్ వి రమణ నాయక్, అదనపు ఎస్పీ ఎల్ చెంచు రెడ్డి తదితరులు హాజరయ్యారు.