-4వ డివిజన్ పార్టీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు
-కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇప్పటి వరకు ప్రజల సమస్యల పై పోరాటం చేశాము. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని విజయవాడ పార్లమెంట్ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. తూర్పు నియోజకవర్గం న్యూపి అండ్ టి కాలనీలో గల 4వ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం నందు కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎంపి కేశినేని శివనాథ్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తో కలిసి పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, తెలుగు మహిళా సంఘం సభ్యులను అభినందించారు.
ఈ సందర్బంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు.ఇక తూర్పు నియోజకవర్గంలో చాలా మంది నాయకులు ఎలాంటి పదవులు ఆశించకుండా చంద్రబాబు నాయుడ్ని ముఖ్యమంత్రి చేసేందుకు కృషి చేశారని కొనియాడారు. గత ఐదేళ్లుగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్నో బాధలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏ పరిస్థితుల్లో కూడా భయపడకుండా వైసిపి దారుణాలపై పోరాడి..నిలబడి..తెలుగుదేశం పార్టీకి ఇంతటి ఘన విజయం కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించటానికి ముఖ్యకారణం అందరం కలిసి కట్టుగా పనిచేయటమే అన్నారు.
ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ గొల్లపూడి నాగేశ్వరరావు,మాజీ కార్పొరేటర్ కాకు మల్లిఖార్జున యాదవ్, ఈస్ట్ ఎస్సీసెల్ ప్రెసిడెంట్ దేవరపల్లి ఆంజనేయులు, ఈస్ట్ తెలుగుమహిళా అధ్యక్షురాలు కె.నాగమణిమ్మ, టిడిపి మహిళా నేతలు చలసాని రోజా, దాసరి నాగశ్రీ, చిత్తా నిర్మల, మాధవి, అట్లూరి ధనలక్ష్మీ, సరళ రాజపూరి, మండవ దుర్గాభవానీ, నాయకులు పామర్తి కిషోర్ బాబు, గుమ్మడి రామకృష్ణ, జాస్తి కృష్ణరావు, ఈనాడు కిషోర్ లతో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.