గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్నికల ఫలితాలు చూసి ఎవరు ఆధైర్యపడవద్దని మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు.సార్వత్రికఎన్నికల్లో గుడివాడ మాజీ మంత్రికొడాలి ఓటమిని తట్టుకోలేక వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం జరిగింది. గుడివాడ రూరల్ మండలం సైదేపూడి గ్రామానికి చెందినపిట్ట అనిల్ మాజీ మంత్రి కొడాలి నాని ఓటమి చెందిన విషయం తెలిసిన వెంటనే ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొడాలి నాని మృతుని ఇంటికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారి 5లక్షలు అర్దిక సహాయం అందించారు.. భవిష్యత్తులో వారి కి అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు నేను అండగా ఉంటానని కొడాలి నాని భరోసా ఇచ్చారు.
Tags gudivada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …