-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించి జిల్లాకు మరింత వన్నె తెచ్చేందుకు కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు. ఏపీఎన్జీవో అసోసియేషన్ నగర శాఖలో ఖాళీ అయిన పదవులకు కో ఆప్షన్ పద్దతిలో ఎన్నిక కాబడిన నగర శాఖ అద్యక్షులు సివిఆర్ ప్రసాద్, సహ అధ్యక్షులు బి. రాజశేఖర్, ఉపాధ్యక్షులు ఎం. శ్రీనివాసరావు, కార్యదర్శి షేక్ నజీరుద్దీన్, కోశాధికారి డిఎస్ ఎన్ శ్రీనివాస్ లు సంఘ నాయకులతో కలిసి శుక్రవారం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఎస్. ఢిల్లీరావుని మర్యాద పూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గ సభ్యులని అభినందించి అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల నిర్వహించిన సాధారణ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించడంలో ఉద్యోగుల సహకారం ఎంతో ఉందన్నారు. ఎన్నికల అనంతరం ఏర్పడనున్న నూతన ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు ఉద్యోగులు బాధ్యతయుతమైన పారదర్శకతతో కూడిన సేవలను అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పధకాలు ప్రజలకు చేరువ చేసి జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచడంలో ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.
జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో ఏపీఎన్జీవో అసోసియేషన్ జిల్లా మాజీ కార్యదర్శి ఎండి.ఇక్బాల్, సహ అధ్యక్షులు పీవి రమేష్, కోశాధికారి బి. సతీష్ కుమార్, నగర శాఖ కార్యదర్శి వివి. ప్రసాద్, ఉపాధ్యక్షులు బి. మధుసూధనరావు, మహిళా కార్యవర్గ సభ్యులు కె. శివలీల, బి. విజయశ్రీ, ఎండి. ఖాసీం సాహెబ్ తదితరులు ఉన్నారు.