విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం వద్ద గల నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఫర్ SC/ST, ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. SC/ST ఉద్యోగార్ధులకు కోచింగ్/ట్రైనింగ్ ఇవ్వడానికి ఆయా సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇతర రెక్రూటింగ్ ఏజెన్సీలు చేపట్టే గ్రూప్ సి మరియు తత్సమాన పోస్టుల కోసం నిర్వహించే వివిధ పరీక్షలలో పోటీపడే విధంగా అభ్యర్థులను తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక కోచింగ్ పథకం కింద పన్నెండు నెలల పాటు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ పథకంలో ఎంపిక అయిన శిక్షణా సంస్థకు ఒక్కో అభ్యర్థికి రూ.1200 చొప్పున అందజేస్తారు. జూలై 1, 2024 నుంచి ఈ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆసక్తి గలవారు జూన్ 15, 2024లోగా తమ దరఖాస్తు పంపాల్సి ఉంటుంది. తదుపరి మార్గదర్శకాలు కోసం మీరు ఈ కార్యాలయం లేదా ఎన్‌సీఎస్‌సీ వైజాగ్ ఫేస్‌బుక్‌ని సంప్రదించగలరు. నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఫర్ ఎస్సీ/ఎస్టీ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయిమెంట్, ప్రభుత్వ ఐటీఐ (బాలికలు) క్యాంపస్, కంచరపాలెం, విశాఖపట్నం – 530007, 0891-2788700, ncsc.vizag@gmail.com.
Tags Visakhapatnam
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …