అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం ఒక రోజు పొడిగించింది. పాఠశాలల పునః ప్రారంభ తేదీని వెల్లడిస్తూ ప్రకటన జారీ చేసింది. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న రాష్ట్రంలోని పాఠశాలల్లో బడిగంట మోగనుంది. 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో.. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. అందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ నిర్ణయం వెలువరించింది.
Tags amaravathi
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …