మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి, ఐటీ పార్క్ వద్ద నిర్వహిస్తున్న సందర్బంగా, ఈ కార్యక్రమానికి గౌరవనీయ దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు, అధికారులు హాజరవుతున్న సందర్బంగా, వాహనదారులు ఎలాంటి ఇబ్బంది పడకుండా, వారి రవాణాకు అంతరాయం ఏర్పడకుండా, పలు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను జిల్లా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రజలు ఈ ట్రాఫిక్ మల్లింపులను దృష్టిలో ఉంచుకొని, మీ యొక్క ప్రయాణాలు నిర్ణయించుకోవాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ పత్రికా ముఖంగా తెలియజేశారు.
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు
విశాఖ పట్నం నుండి చెన్నై వైపు వెళ్లే వాహనాలను
1 .కత్తిపూడి నుండి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు.
2 . విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లి వచ్చే వాహనాలను కత్తిపూడి నుండి ఒంగోలు వైపు మళ్లించడం జరిగింది.
చెన్నై నుండి విశాఖపట్నం వైపు వచ్చు వాహనాలు
1 .ఒంగోలు నుండి రేపల్లె మీదుగా వయ మచిలీపట్నం – లోసర్ బ్రిడ్జి – నరసాపురం – అమలాపురం – కాకినాడ – కత్తిపూడి మీదుగా విశాఖపట్నం వైపు మరలించడం జరిగింది.
2 . బుడంపాడు నుండి తెనాలి – పులిగడ్డ – మచిలీపట్నం – లోసర్ బ్రిడ్జి – నర్సాపురం – కాకినాడ – కత్తిపూడి వైపు మళ్లింపు.
విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను_
1 . గామన బ్రిడ్జి – దేవరపల్లి – జంగారెడ్డిగూడెం – అశ్వరావుపేట – ఖమ్మం మీదుగా హైదరాబాద్
2 . భీమడోలు – ద్వారకాతిరుమల – కామవరపుకోట – చింతలపూడి నుండి ఖమ్మం వైపు
3 . ఏలూరు బైపాస్ నుండి – జంగారెడ్డిగూడెం మీదుగా అశ్వరావుపేట – ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు.
4 . ఏలూరు బైపాస్ – చింతలపూడి నుండి సత్తుపల్లి మీదుగా.
5 . హనుమాన్ జంక్షన్ – నూజివీడు, మైలవరం – ఇబ్రహీంపట్నం – నందిగామ మీదుగా హైదరాబాద్ వైపు మళ్లింపు
హైదరాబాద్ నుండి విశాఖపట్నం వచ్చు వాహనాలను
1 . నందిగామ – మధిర – వైరా – సత్తుపల్లి – అశ్వరావుపేట – జంగారెడ్డిగూడెం – దేవరపల్లి – గామన బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు
2 . ఇబ్రహీంపట్నం – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు.
3 . రామవరప్పాడు – నున్న – పాముల కాలువ – వెలగలేరు – జి.కొండూరు – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ – ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు.
4 . విజయవాడ నుండి ఎనికేపాడు మీదుగా 100 అడుగుల రోడ్డు – తాడిగడప – కంకిపాడు – పామర్రు – గుడివాడ నుండి భీమవరం వైపు
పైన తెలిపిన ట్రాఫిక్ మల్లింపును ప్రజలందరూ దృష్టిలో ఉంచుకొని మీయొక్క ప్రయాణాలను కొనసాగించాలని. అలాగే పోలీస్ వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ తెలిపారు