గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలు తిలకించేందుకు గుంటూరు నగరంలో 14 ప్రాంతాల్లో ఎల్.ఈ.డి. స్క్రీన్ లు ఏర్పాటు చేశామని నగర కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కేసరపల్లి వద్ద ఉదయం 11:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ప్రమాణ స్వీకార కార్యకమాన్ని నగర ప్రజలు తిలకించడానికి వీలుగా గుంటూరు నగరంలోని ప్రధాన కూడళ్ళు అయిన బస్టాండ్ వద్ద గల ఎన్.టి.ఆర్. సర్కిల్, బారా ఇమాం పంజా సెంటర్, పొన్నూరు రోడ్ లోని తూర్పు ఎంఎల్ఏ కార్యాలయం వద్ద, మాయా బజార్ సెంటర్, పాత గుంటూరు ఆంజనేయ స్వామి గుడి వద్ద, హిమని సెంటర్, ఏటుకూరు రోడ్ లోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడి వద్ద, నాజ్ సెంటర్, డొంక రోడ్ లోని ఓంకారం గుడి వద్ద, ఎన్.టి.ఆర్. స్టేడియం, శ్రీనివాసరావుపేటలోని పశ్చిమ నియోజకవర్గ ఎంఎల్ఏ కార్యాలయం వద్ద, గుజ్జనగుండ్ల సెంటర్, అమరావతి రోడ్, మిర్చి యార్డ్ వద్ద ఎల్.ఈ.డి. స్క్రీన్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, గాంధీ పార్క్ లను విద్యుత్ దీపాలతో అలంకరణ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
Tags guntur
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …