గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో బక్రీద్ పండుగ సహుద్ర్భావ వాతావరణంలో జరుపుకోవాలని, నగరపాలక సంస్థకు ముస్లిం మత పెద్దలు సహకరించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి కోరారు. కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ నెల 17న జరగబోయే బక్రీద్ పండుగ నిర్వహణ పై ముస్లిం మత పెద్దలు, గో సంరక్షణ సమితి సభ్యులు, పోలీసు, రెవెన్యూ, పశు సంవర్ధక శాఖ, నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సిహెచ్.శ్రీనివాస్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ మంచి ఆరోగ్యకర వాతావరణంలో జరుపుకోవాలని, ప్రభుత్వ నిబందనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. అనధికార జంతు వధ నిషేదమని, నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన జంతు వధశాలను వినియోగించుకోవాలన్నారు. 1977 ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేదం మరియు పశు సంరక్షణ చట్టం సెక్షన్ 05 ప్రకారం రాష్ట్రంలో మగ లేదా ఆడ అయినటువంటి ఆవు, దూడలను, గేదెలను ఎట్టి పరిస్థితిలలోను వధించరాదు అని స్పష్టం చేశారు. కనుక ప్రతి ఒక్కరూ సహకరించాలని, మసీదుల్లో ముస్లిం పెద్దలు గోవధ నిషేధము, పండుగ నిర్వహణపై సూచనలు చేయాలన్నారు. జిఎంసి పరిధిలో జిఎంసి ప్రజారోగ్య అధికారులు, ఇతర శాఖల అధికారులతో 4 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో ఎక్కడైనా గోవధ జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే జిఎంసి కంట్రోల్ రూమ్ 98499 08391కు లేదా 0863-2345103 నంబర్లకు కాల్ చేసి తెలియ చేస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు వెంకట కృష్ణయ్య, వెంకట లక్ష్మీ, సిఎంఓహెచ్ డాక్టర్ ఆషా, యంహెచ్ఓ(ఎఫ్ఏసి) మధుసూదన్, ఎస్.ఎస్.లు గోసరక్షణ సమితి సభ్యులు, ముస్లిం మత పెద్దలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …