-ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ నందు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో పనులలో భాగమైన 7 ఇండస్ట్రియల్ ఎస్టేట్ లకు నీటి సరఫరా పనులు, భూసేకరణ, ఆక్రమణ ల విషయాలు తదితర పలు అంశాలపై విసిఐసి, రెవెన్యూ, నేషనల్ హైవేస్ పిడి, ఆర్ అండ్ బి తదితర శాఖల వారితో సమన్వయ సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సదరు అంశాలపై అధికారులు దృష్టి పెట్టి త్వరిత గతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, పీడీ ఎన్హెచ్ఎఐ వెంకటేష్, గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్, జిల్లా ఆర్ అండ్ బి అధికారి మధుసూదన్ రావు, ఏపీఐఐసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నరసింహులు, తిరుపతి స్పెషల్ ప్రాజెక్ట్స్ జోన్ జడ్ ఎం, నెల్లూరు విజయరత్నం, డిప్యూటీ జడ్ఎం చంద్రశేఖరయ్య తదితరులు పాల్గొన్నారు.