Breaking News

ఈ నెల 16 న యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2024 నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి

-తిరుపతి ఆర్.డి.ఓ. కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెం. 9000665565, 9676928804
-తిరుపతి జిల్లాలో 11 పరీక్షా కేంద్రాలు
-హాజరు కానున్న 5518 మంది అభ్యర్థులు : జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 16 న ఆదివారం యు.పి.ఎస్.సి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు 2024 పకడ్బందీగా నిర్వహించాలని పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ విసి హాల్ నందు ఈ నెల 16 న జరగనున్న యు.పి.ఎస్.సి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై సంబందిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 16 న ఆదివారం యు.పి.ఎస్.సి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు 2024 పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు 11 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 5518 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఇందుకొరకు 11 మంది లోకల్ ఇన్స్పెక్టింగ్ అధికారి(తహశీల్దార్), 11 చీఫ్ సూపరింటెండెట్స్, 5 మంది జిల్లా అధికారులను సహాయ సమన్వయ అధికారులుగా విధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లా జాయింట్ కలెక్టర్ అబ్జర్వర్ గా వ్యవహరిస్తారని , తిరుపతి ఆర్.డి.ఓ. పరీక్ష పేపర్ల కస్టోడియన్ గా వ్యవహరించనున్నారని. తిరుపతి ఆర్.డి.ఓ. కార్యాలయంలో ఈ నెల 15 & 16 తేదీలలో కంట్రోల్ రూమ్ నెం 9000665565, 9676928804 లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆదివారం ఉదయం 9.30 AM నుండి 11.30 AM , మధ్యాహ్నం 2.30 PM నుండి 4.30 PM వరకు రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహణ ఉంటుందని పరీక్షల సమయానికి 30 నిమిషాల ముందు పరీక్ష కేంద్రాల ప్రధాన గేట్లు మూసివేస్తారని ఆ పై ఒక్క నిమిషం ఆలస్యం అయిన అనుమతి ఉండదని తెలిపారు. పరీక్ష రాయనున్న అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐ.డి కార్డు కూడా తీసుకురావాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్ లు, వైర్లెస్ హెడ్ సెట్స్, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి ఉండదని , పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు, ఆర్టీసి బస్సు సౌకర్యం, మెడికల్ క్యాంప్ లు, విద్యుత్ అంతరాయం లేకుండా సంబందిత శాఖల అధికారులు చూడాలని, త్రాగు నీరు, టాయిలెట్స్ సక్రమంగా ఉండాలని, పోస్టల్ డిపార్ట్మెంట్ కు పూర్తి అయిన పరీక్ష పత్రాలను సక్రమంగా అందించాల్సి ఉంటుందని ఆదేశించారు. అభ్యర్థుల సౌకర్యార్దం సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్ టి సి వారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పరీక్ష రాసే అభ్యర్థులు ముందు రోజే వచ్చే విధంగా చూసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాలలో జామర్ ఏర్పాటు సంబంధిత ఏజెన్సీ ఏర్పాటు చేస్తారని తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అలసత్వం లేకుండా పక్కాగా ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ శాఖ వారు నిబంధనల మేరకు అభ్యర్థుల ఫ్రిస్కింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

పరీక్షా కేంద్రాల కోడ్ /వివరాలు :

1) 50005 శ్రీ పద్మావతి గర్ల్స్ హై స్కూల్, బాలాజీ కాలనీ, తిరుపతి
2) 50015 శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం , తిరుపతి
3) 50007 SV యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, ప్రకాశం భవన్,SV యూనివర్సిటీ, తిరుపతి
4) 50008 SV యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, SV యూనివర్సిటీ క్యాంపస్, తిరుపతి
5) 50011 శ్రీ గోవింద రాజ స్వామి ఆర్ట్స్ కళాశాల (వింగ్ – A), తిరుచానూరు రోడ్డు, తిరుపతి
6) 50012 శ్రీ గోవింద రాజ స్వామి ఆర్ట్స్ కళాశాల (వింగ్ – B), తిరుచానూరు రోడ్డు, తిరుపతి
7) 50013 ఎస్ ఎస్ వి హై స్కూల్, , P.P. చావడి వీధి, మహతి ఆడిటోరియం వెనుక, తిరుపతి
8) 50018 ఎస్.వి ఆర్ట్స్ కాలేజ్ (వింగ్ -A) బాలాజీ కాలనీ, తిరుపతి
9) 50019 ఎస్.వి ఆర్ట్స్ కాలేజ్ (వింగ్ -B) బాలాజీ కాలనీ, తిరుపతి
10) 50001 శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కాలేజ్ (వింగ్ – A), తిరుపతి
11) 50002 శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కాలేజ్ (వింగ్ – B), తిరుపతి.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, యుపీఎస్సి అధికారి, విధులు కేటాయించబడిన చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టింగ్ అధికారులు, సహాయ కోఆర్డినేటింగ్ అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *