-ఆహ్లాదకరంగా పచ్చదనంతో కూడిన పరిశుభ్రత నగరంగా సుందరీ కరణ అవసరం.
-శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరంను కాలుష్య రహిత నగరముగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో మెరుగైన పారిశుద్ద్య నిర్వహణ (శానిటేషన్) పక్కా ప్రణాళికతో నిర్వహించేలా కృషి చేయాలని రాజమండ్రి సిటీ నుంచి గెలుపొందిన శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు.
శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న శానిటేషన్, డీసిల్టేషన్, షాగింగ్, స్ట్రెయింగ్ నిర్వహణ వంటి అంశాలపై మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ తో కలిసి ఆయన భవిష్యత్ కార్యాచరణ పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ , నగరంలో ఎన్ని మౌలిక సదుపాయులు కల్పించినప్పటికీ పూర్తి స్థాయిలో మెరుగైన శానిటేషన్ పక్కాగా నిర్వహించలేకపోతే నగరానికి తగిన గుర్తింపు ఉండదన్నారు. రాజమహేంద్రవరం నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు సక్రమంగా పారిశుద్ద్య నిర్వహణ, డీసిల్టేషన్, ఫాగింగ్, స్ట్రేయింగ్ నిర్వహణను నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పక్కా ప్రణాళికతో నిర్వహిస్తు అమలు చేయాల్సి ఉందన్నారు. నగరంలో అనేక మాల్స్, పార్క్సు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయని ప్రతి రోజు వివిధ పనులకు సంబందించి వర్తక వ్యాపారస్తులు, సందర్శకులు బయట నుంచి కూడా వస్తుంటారన్నారు . వారికి రాజమహేంద్రవరం నగరం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉందనే ఆలోచన వచ్చే విధంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిదంగా వాంబే గృహల పరిశర ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ద్య నిర్వహణను పక్కా ప్రణాళికతో అమలు చేయాలని ఆయన పలు సూచనలు చేసారు.
మున్సిపల్ కమీషనర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ కాలుష్యరహిత స్వచ్చమైన నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దడంలో ప్రజా ప్రతినిధులు అందిస్తున్న పలు సూచనలు, సలహాలను ఆచరణలోనికి తీసుకొని అమలు చేస్తామని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ప్రజారోగ్య, శానిటేషన్ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ నగర ప్రజలతో గౌరవ మర్యాదలతో చక్కని సత్ప్రవర్తన కలిగివుండాలన్నారు. భారత ప్రభుత్వం , భారత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం కింద ఏటా జాతీయ నగర రేటింగ్‌ను ప్రచురిస్తుందని, టాప్ 20 రేటింగ్‌లో ఆకుపచ్చ అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తిస్తారన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 యొక్క తాజా ర్యాంకింగ్ ఇండోర్‌ను భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తించిందన్నారు. మన రాజమహేంద్రవరం నగరాన్ని కూడా ఆదిశగా అత్యంత పరిశుభ్రమైన నగరంగా అందరి సమిష్ట భాగస్వామ్యం, కృషి తో తీర్చిదిద్దుదామన్నారు.
సమావేశంలో అదనపు కమీషనర్ పి ఎం సత్యవేణి, యంహెచ్ఓ డా వి. వినూత్న, శానిటరీ సుపర్వైజర్ ఐ. శ్రీనివాస్, ఆర్ ఎం సి అధికారులు శానిటరీ సిబ్బంది, స్ధానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.