-న్యాక్ సెంటర్ ఇంఛార్చి జయలక్ష్మి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధానమంత్రి కౌశల్ వికాసయోజన (పియంకేవివై) క్రింద అసిస్టెంట్ సర్వేయర్ మరియు హెల్పర్ ఎలక్ట్రిషియన్ కోర్సులలో ప్రవేశాల కొరకు రాజమహేంద్రవరం కలక్టరేట్ లో గల నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ (NAC) వారు నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రవేశం కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నారని బొమ్మూరు న్యాక్ సెంటర్ ఇంఛార్చి విబిపీ జయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామీణ, పట్టణ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియో చేసుకోవాలని పిలుపునిచ్చారు. శిక్షణా కాలంలో స్టేషనరీ, టీ షర్టు ఇవ్వడం జరగుతుందని, శిక్షణ అనంతరం ఆయా కోర్సుకు సంబందించిన సర్టిఫికేట్ అందజేయడంతో పాటు జాబ్ కూడా చూపించడం జరుగుతుందని పేర్కొన్నారు.
విద్యార్హతలు పదవ తరగతి ఆపై రెండు సంవత్సరాలు (10+2) ఏదైనా ఐటీఐ, డిప్లోమో, బిటెక్, ఏదేని డిగ్రీ ఆపైన చదివిన విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చున్నారు. కోర్సు కాలవ్యవది రెండు నెలలు ఉంటుందన్నారు. దరఖాస్తుదారుల వయో పరిమితి 18 సంవత్సరాలు నుంచి 45 సంవత్సరాలు లోపు ఉండాలని, శిక్షణాకాలంలో సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటలు వరకు ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తును చివరి తేది అయిన జూన్ 25 లోపు సమర్పించాలన్నారు.
జాయిన్ అయ్యే అభ్యర్థలు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్హతల సర్టిఫికేట్స్ జిరాక్స్ ప్రతులు మరియు రెండు పాస్ పోర్టు సైజ్ ఫోటోలను తీసుకొని బొమ్మూరు జిల్లా కలెక్టరు కార్యాలయంలో గల న్యాక్ సెంటర్ ఇంఛార్జి కార్యాలయంలో ది. 25.6.2024 లోపు అందజేయాలన్నారు. ఈ సదావకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జయలక్ష్మి ఆ ప్రకటనలో కోరారు.
ఇతర వివరములు కొరకు 9666770760,.. 8919784495 ఫోన్ నెంబర్లును సంప్రదించగలరు.