– కమిషనర్ కె.దినేష్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతము వర్షాకాల సీజను ప్రారంభమయినందున నగరములో వర్షములు తరచుగా కురిసే అవకాశమున్నది. తద్వారా పల్లపు ప్రదేశములలో నీరు నిలువవుండి దోమల వ్యాప్తి పెరుగుటకు అవకాశమున్నది. మరీ ముఖ్యముగా నగరములోని ఖాళీస్థలములు వర్షకాల సమయములో దోమలకు ఆవాసమవుతున్నవి. తత్కారణముగా సదరు ఖాళీస్థలములకు దగ్గరగా, చుట్టూ ఉన్న నివాసితులకు దోమ సంబంధిత డెంగ్యూ / మలేరియా వంటి వ్యాధులు సంక్రమించు చున్నవి. ఈ సందర్భముగా నగరములోని ఖాళీస్థలముల యజమాను లందరూ ఒక వారం రోజులలో తమ ఖాళీ స్థలముల లోని తుప్పలను పూర్తిగా తొలగించి స్థలములో నీరు నిల్వ ఉండకుండా మట్టితో లెవెలింగ్ చేయించుకొనవలసినదిగా తెలియచేయడమైనది. అట్లు చేయని యెడల నిబంధనల మేరకు సదరు ఖాళీస్థలముల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని నగరపాలక సంస్థ కమిషనరు కె.దినేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు.