రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యాటక , సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాజమహేంద్రవరం కు శనివారం చేరుకోవడం జరిగింది. స్ధానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకెను అందచేసి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పర్యటక పరంగా జిల్లాలో అవకాశం ఉన్న పలు అంశాలపై కలెక్టర్ తో మంత్రి కందుల దుర్గేష్ చర్చించడం జరిగింది. మంత్రిని కలిసి పుష్ప గుచ్చెం అందచేసి అభినందనలు తెలిపిన వారిలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి ఉన్నారు
Tags rajamandri
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …