అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారాన్ని చేసి బాధ్యతలు స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు PV శివారెడ్డి మరియు ఇతర నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాను అందజేసి శుభాభినందనలు తెలిపారు. ఏపీ జెఎసి మరియు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తుందని, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి మద్దతు తెలియజేశారని, ప్రభుత్వం కూడా ప్రజల కోసం సిద్ధం చేసే కార్యక్రమాలు అన్నిటిని ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో ఉద్యోగులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ఉద్యోగులకు సంబంధించిన అన్ని విషయాలలో ప్రభుత్వానికి పూర్తి చేయొద్దున అందిస్తామని కొత్త ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలైన సదుపాయాలు మేలైన పాలన అందించడంలో ఉద్యోగులు గురుతరమైన పాత్ర వహిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రిని అభినందించిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ నాయుడు, కోశాధికారి రంగారావు, ఉపాధ్యక్షులు డివి రమణ, ఎన్జీవో నాయకులు కృష్ణారెడ్డి, సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు జానీ భాష తదితరులు ఉన్నారు…
Tags amaravathi
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …