-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ఎలా జరుగుతుంది, వ్యర్థ పదార్థాల నుండి ఉపయోగపడే వస్తువులను ఎలా తయారు చేస్తున్నారు అన్న దాని గురించి ప్రజలకు, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించే మ్యూజియం, RRR విజ్ఞాన కేంద్రం త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని , శనివారం అజిత్ సింగ్ నగర్, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో గల RRR విజ్ఞాన కేంద్రం ను పరిశీలించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అజిత్ సింగ్ నగర్ లో గల గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో ఫ్లవర్ వేస్ట్ మేనేజ్మెంట్, విండో కంపోస్టింగ్, వర్మి కంపోస్ట్ ప్లాంట్, బయో మిథనేషన్ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మ్యానేజ్మెంట్ ప్లాంట్ల, మినీ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ట్రీ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, మాట్రేస్స్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, సి&డి వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ ల గురించి త్రీడి పద్దతిలో ప్రతేక్షంగా విద్యార్థులకు, పిల్లలకు, ప్రజలందరికీ సమాచారాన్ని చూపించి వ్యర్థ పదార్థాల నిర్వహణ లో అవగాహన పెంచడమే RRR విజ్ఞాన కేంద్రం ముఖ్య ఉద్దేశ్యం అని కమీషనర్ అన్నారు.
RRR విజ్ఞాన కేంద్రంలో , విద్యార్థులకు, చిన్నపిల్లలకు సులువుగా అర్థమయ్యే రీతిలో వ్యర్థ నిర్వహణ సంబంధించి వీడియో గేమ్ ప్రత్యేక ఆకర్షణ మాత్రమే కాదు అవగాహన కూడా కల్పిస్తుందన్నారు.